కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఆకాంక్షించారు.
ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, ఈ రోజు ఉదయం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి కూడా కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని పవన్ కళ్యాణ్ ఒక…
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్…
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం చెందారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన…
CM Revanth Reddy : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానిని గొప్ప ఆర్థికవేత్తలు, నాయకులు, సంస్కర్త , అన్నింటికంటే మానవతావాది అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని, అన్నింటికీ మించి నిర్ణయం తీసుకోవడంలో మానవీయ స్పర్శతో గుర్తించబడ్డారని రేవంత్ రెడ్డి ఒక…
CM Chandrababu : భారత మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి అపార లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మహా మేధావి, ప్రగాఢ రాజకీయ దూరదృష్టిగల నేతగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మరణం…
Lakshma Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చెర్లకోళ్ల లక్ష్మారెడ్డి భార్య శ్వేతా లక్ష్మారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధాన మంత్రులు స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా ప్రపంచ నాయకులు తన ప్రగాఢ సంతాపన్ని వ్యక్తం చేశారు.