Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ ‘‘వైట్ కాలర్’’ మాడ్యుల్‌తో సంబంధం ఉన్న మరో మహిళా వైద్యురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో హర్యానా రోహ్‌తక్‌కు
జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
Encounter: శనివారం (2 అక్టోబర్ 2024) దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్‌లోని కచ్వాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.…
Amarnath Yatra2024 : దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో కట్టుదిట్టమైన భద్రతలో జరుగుతున్న వార్షిక తీర్థయాత్రలో రెండవ రోజు ఆదివారం 14,717 మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీపై గత కొంతకాలంగా నాన్చుతూ వస్తున్నారు. పోటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తు్న్న కారును, ముఫ్తీ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొట్టింది.
Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్‌లో అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్‌లో తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ అక్కడికక్కడే మరణించగా..
Man Kills Mother, Neighbours After Fight Over "Going Out Naked": జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొడుకును వారించింది తల్లి. దీంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. అడ్డుగా వచ్చిన చుట్టుపక్కల వారిపై దాడి చేసి మరో ఇద్దరిని చంపేశాడు. నిందితుడు మానసిక వికలాంగుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.