బంగారం ప్రియులను పసిడి ధరలు కలవరపెడుతున్నాయి. గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతూ కొనుగోలు దారులకు షాకిస్తున్నాయి. గోల్డ్ ధరలు వేలల్లో పెరుగుతు సామాన్యులను భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగింది. కానీ, నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. నేడు తులం బంగారంపై రూ. 150 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,945, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,667 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరగడంతో రూ. 79,450 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 పెరగడంతో రూ. 86,670 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,600గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 86,820 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్న వేళ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద అమ్ముడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 99,500 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.