Rajnath Singh Phone to YS Jagan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన ఎన్డీఏ.. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు పలకాలని చర్చలు మొదలు పెట్టారు కమలనాథులు. ప్రతిపక్ష నేతల మద్దతు కోసం వాళ్లతో చర్చించడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ ఫోన్‌లో మాట్లాడిన రాజ్‌నాథ్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కూడా ఫోన్ చేశారు..
Read Also: Rahul Sipligunj : ప్రేయసితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని వైఎస్ జగన్ ను కోరారు రాజ్‌నాథ్ సింగ్.. రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యుల బలం ఉండగా.. ఇటు లోక్‌సభలో వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు.. దీంతో, వైసీపీ అధినేతకు ఫోన్ చేసి.. మద్దతుకోరారు రాజ్‌నాథ్.. ఇక, బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు వైఎస్ జగన్.. అయితే, బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. గతంలోనూ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు వైఎస్ జగన్.. ఇక, ఇటీవలే రాహుల్ గాంధీపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేయడంతో.. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ జగన్ మద్దతు ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది..