Vijayawada Tragedy: ప్రేమకు అడ్డుగా మారిన వయస్సు.. యువకుడు ఆత్మహత్య..
- విజయవాడ లో విషాద ఘటన..
- ప్రేమను అంగీకరించ లేదు అని యువకుడు సూసైడ్..
- యువతి రెండేళ్లు పెద్దకాడమే కారణంగా చెబుతున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Tragedy: విజయవాడ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ చిట్టీనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యశ్వంత్ గత రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే యువతికి యశ్వంత్ కంటే రెండు సంవత్సరాలు వయసు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రేమను ఇరువురు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి ఇటీవల వివాహం ఖరారు కావడంతో యశ్వంత్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు.
Read Also: Astrology: జనవరి 31, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ఈ నేపథ్యంలో యశ్వంత్ తన స్నేహితుడు తేజకు లేఖ రాసి, తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన యువతిని ఎవరూ నిందించవద్దని పేర్కొన్నాడు. అలాగే, కొంతమందికి తాను అప్పులు ఉన్న విషయాన్ని కూడా లేఖలో వెల్లడించాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యశ్వంత్ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి స్థానికంగా ఓ టిఫిన్ హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమాచారం అందుకున్న విజయవాడ కొత్తపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!