ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ఇండియా కూటమి గుర్తించింది. అనుకున్నదానికంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ గుర్తించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. అనంతరం ఎంపీలంతా ఒక్కొక్కరిగా ఓట్లు వేస్తున్నారు.
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర…
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది.. ఎన్డీఏ అభ్యర్థికే మా మామద్దతు ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.. తెలుగు వ్యక్తి అన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉంటేనే అభ్యర్థిని పెట్టాలని సలహా ఇచ్చారు.. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి “ఇండియా” కూటమి రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు.. అసలు మేం ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రతిపక్ష (ఇండియా కూటమి) అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం..? అని ప్రశ్నించారు..
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు..
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను పోలింగ్ రోజే.. అనగా సెప్టెంబర్ 9నే ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
Vice presidential poll: సోమవారం జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. వైద్య కారణాలను చూపుతూ ధంఖర్ సోమవారం సాయంత్రం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు పంపారు, తక్షణమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.