DC vs RCB: ఢిల్లీ వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి కేవలం 11 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ 15 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు చేసి మంచి స్కోర్ కు నంది వేశారు. ఆపై కె.ఎల్.రాహుల్ 39 బంతుల్లో 41 పరుగులతో స్థిరంగా ఆడినా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. చివర్లో విప్రజ్ నిగం 6 బంతుల్లో 12 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్లలో వికెట్లు త్వరగా కోల్పోవడంతో ఢిల్లీ 162 పరుగులకే పరిమితమైంది.
ఇక బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. జోష్ హాజెల్‌వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు, యశ్ దయాల్, క్రునాల్ పాండ్యా చెరో వికెట్ తీసి ఢిల్లీ స్కోరును కట్టడి చేశారు. సుయశ్ శర్మ మాత్రం 22 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయారు. చూడాలి మరి ఈ టార్గెట్ ను ఆర్సీబీ ఛేదించి రివెంజ్ ను తీర్చుకుంటుందో లేదో.