David Warner : హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేయడమే ఈ మూవీపై క్రేజ్ ను పెంచుతోంది. వాస్తవానికి ముందు నుంచి డేవిడ్ వార్నర్ ను పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న టైమ్ లో డేవిడ్ వార్నర్ ను లేపుతున్నట్టు అనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్ననే చేయాల్సి ఉంది. కానీ వార్నర్ రాక కోసం వాయిదా వేసి మరీ కొత్త డేట్ ను ప్రకటించారు.
Read Also : MLC Kavitha : ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
ఇక నిన్న మార్నింగ్ వార్నర్ హైదరాబాద్ కు రావడం దగ్గరి నుంచి స్టేజి దగ్గరకు రావడం.. డ్యాన్స్ చేయించడం.. ఆయనతో మూవీ గురించి, టీమ్ గురించి గొప్పగా చెప్పించుకోవడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయించారు. దాంతో డేవిడ్ వార్నర్ ను ఇంత హైలెట్ చేస్తున్నారేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా నితిన్ కంటే వార్నర్ నే ఎక్కువ హైలెట్ చేస్తున్నారని అంటున్నారు. వార్నర్ కు ఇప్పుడు ఫేమ్ లేదు. మొన్న ఐపీఎల్ లో కూడా ఎవరూ కొనలేదు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా వార్నర్ ను దాదాపు పక్కన పెట్టేశారు. మిగతా ప్లేయర్లను ఆరాధిస్తున్నారు. పైగా సినిమాలో కొన్ని నిముషాలే ఉండే రోల్ చేశాడంట వార్నర్. అలాంటప్పుడు సినిమా మొత్తం చేసిన నితిన్ కంటే వార్నర్ కు ఇంత హైప్ ఇస్తే రేపు మూవీ హిట్ అయితే ఆ క్రెడిట్ వార్నర్ ఖాతాలోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు సినిమా నిపుణులు.