రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తోందని, రేవంత్ రెడ్డి మొండితనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి అత్తెసరు.. చదువు చదువుకున్నారు.. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్.. ఇద్దరూ కలిసి గ్రూప్ 1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవో 29తో బీసీ,ఎస్సి,ఎస్టీ అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బండి సంజయ్ కు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అభ్యర్థులను ఎందుకు కలవరు.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. 60 ఉద్యోగాలు యాడ్ చేసి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, 28,150 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి కలిసి తప్పుడు జీవోను తీసుకువచ్చారన్నారు.
Viral Video: ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్
అంతేకాకుండా..’రేవంత్ రెడ్డి ప్రైవేటు ఎస్టేట్ రిక్రూట్మెంట్ కాదు.. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి కోసం హడావిడిగా పరీక్షలు పెడుతున్నారు.. ఎన్టీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్పోడు కాదు.. ఇచ్చిన జీవోను 24 గంటల్లో ఎన్టీఆర్ వెనక్కి తీసుకున్నారు.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు జీవోను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలి.. రెండు నెలలు ఆలస్యం అయితే రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏంటి…? అగ్రవర్ణ మనస్తత్వంతో మహేందర్ రెడ్డి వ్యవహరించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.. జీవో 55 అన్ని వర్గాలకు.. న్యాయం చేసే జీవో.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.. పేదల జీవితాన్ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి మంత్రులు సమాధానం చెప్పాలి.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది.. చీఫ్ సెక్రటరీ రేవంత్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్నారు.. గ్రూప్స్ అభ్యర్థులకు కేంద్రంగా తెలంగాణ భవన్ మారింది..
Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు.. ఈ రోజు 6 ఇండిగో విమానాలకు బెదిరింపులు..
మేము నిరుద్యోగులకు అండగా ఉండాలని వెళ్ళాము. బండి సంజయ్ నిన్న అశోక్ నగర్ నుండి బారాత్ చేశారు.. బండి సంజయ్ తానే పోలీసులతో అరెస్టు అయ్యి.. నన్ను ఎవరు అరెస్టు చేస్తారని అంటున్నారు.. బండి సంజయ్ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తుతారు.. రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కు ఉన్న సంబంధం ఏంటి.. ఇష్టం వచ్చినట్లు కేటీఆర్ ను బండి సంజయ్ తిట్టారు.. బీఆర్ఎస్ వాళ్ళను కొట్టించానని.. బండి సంజయ్ చెప్తున్నారు. నిరుద్యోగుల సమస్యను బండి సంజయ్ తప్పుదోవ పెట్టించారు. బీసీ సిఐను బండి సంజయ్ ట్రాన్స్ఫర్ చేయించారు.. ఎక్కడ ఈటల రాజేందర్ హైలెట్ అవుతారని బండి సంజయ్ రోడ్డు ఎక్కారు..
బండి సంజయ్ సంస్కారవంతుండా.. బండి సంజయ్ కు దమ్ముంటే సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లను పెట్టి నిరుద్యోగుల తరపున వాదించు.. కార్పోరేటర్ మనస్తత్వాన్ని బండి సంజయ్ వీడటం లేదు.. జెడ్పిటీసీ మనస్తత్వాన్ని రేవంత్ రెడ్డి వీడటం లేదు’ అని దాసోజ్ శ్రవణ్ వ్యాఖ్యానించారు.