Vivekananda Goud: బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్ఎస్ నేత క్యామ్ మల్లేశ్ బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఈ సమావేశంలో భాగంగా.. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాసిన లేఖను తనకు ఆస్కార్ లాంటిదని రేవంత్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు.…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
MLC Nominations: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి…
తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీసులు (ఏడీజీపీ) తమ సహోద్యోగులలో 39 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 12వ బెటాలియన్‌కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. సస్పెండ్ చేసిన తమ సహోద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 27 ఆదివారం నల్గొండ జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరించడం లేదని భావించిన పోలీసు యంత్రాంగంలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ నిరసన హైలైట్ చేసింది. తమ…
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన, నిరంకుశ చర్యలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. తమ ఫిర్యాదులను శాంతియుతంగా లేవనెత్తినందుకు 39 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం స్పష్టమైన అణచివేత చర్య , వారి గౌరవం , రాజ్యాంగ హక్కులపై దాడి అని ఆయన అన్నారు.
దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాది కపిల్ సిబల్ సహా సీనియర్ న్యాయవాదులను మేము ఈ కేసు కోసం నియమించామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటుందని కోర్ట్ స్పష్టం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి వాటిని వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు భావించిందన్నారు. పరీక్షలు నిర్వహిస్తే నిర్వహించారు, ఫలితాలను…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తోందని, రేవంత్ రెడ్డి మొండితనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి అత్తెసరు.. చదువు చదువుకున్నారు.. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్.. ఇద్దరూ కలిసి గ్రూప్ 1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవో 29తో బీసీ,ఎస్సి,ఎస్టీ అభ్యర్థుల నోట్లో మట్టికొడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బండి సంజయ్ కు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అభ్యర్థులను…
హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్,హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి,చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 'స్టే' సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.