ఒకవైపు మాండూస్ తుఫాన్, మరోవైపు భారీవర్షాలతో తిరుమల వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వానలతో జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో గత రెండు రోజులుగా శేషాచల కొండల్లో కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలశయా లకు జలకల సంతరించుకుంది.నిన్న ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని పాపవినాశనం డ్యాం పూర్తిగా నిండిపోగా..గోగర్భం డ్యాంలో 90శాతంకీ పైగా నీరు చేరింది.

నిన్న ఉదయం నుంచి సప్తగిరులపై కురుస్తున్న వర్షానికి..ఎగువ అటవీ ప్రాంతం నుంచి భారీగా నీరు జలశాయాలలోకి చేరుకోవడంతో జంట జలాశయలైన కుమారధార… పసుపుధారలతో పాటు పాపవినాశనం డ్యాంలోకి భారీగా వరద నీరు చేరింది.ఇంకా కుడా ఎగువ ప్రాంతం నుంచి డ్యాంలలోకి వరద నీరు వస్తూ ఉండడంతో ఆప్రమత్తమైన టీటీడి అధికారులు పాపవినాశనం డ్యాంలో ఒక్క గేట్ ను ఇంచ్ మేర ఎత్తి వేసి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేశారు.ఈ నీరంతా కడప జిల్లా కుక్కలదొడ్డి వైపు వున్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళనుండడంతో ముందుగానే వాటర్ వర్క్స్ అధికారులు కడప జిల్లా నీటిపారుదల శాఖాధికారులతో పాటు ఈ నీరు ప్రవహించే వైపు నివాసం వుండే ప్రజలను అప్రమత్తం చేశారు.
Read Also:BIG BREAKING : పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
16లక్షల గ్యాలన్ల నీటిని ప్రస్తుతం విడుదల చేశామని..ఇన్ ఫ్లో ఎక్కువైతే మరింత నీటిని విడుదల చేస్తామని ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. జంట జలాశయాలైన కుమారధార,పసుపుధారలతో పాటు ఆకాశగంగ జలాశయాలు కూడా నిండి వాటర్ ఓవర్ ఫ్లో అవుతోంది. గోగర్భం డ్యాం దాదాపుగా నిండిపోతోందని, డ్యాం పూర్తిగా నిండగానే గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తామంటున్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల కొండలపై తిరిగే భక్తులు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Pan-Aadhar Linkage: పాన్-ఆధార్ లింక్ చేసుకున్నారా? తుది గడువు ఇదే..!!