Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం.. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
FASTag Annual Pass: అదరగొట్టిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్.. తొలి రోజే ఎంతమంది కొనుగోలు చేసారంటే?
ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ.. వర్షాలు, గాలులు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
Halagali : తెలుగులోకి గ్రేట్ హిస్టారికల్ మూవీ ‘హలగలి’
విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ అలర్ట్. కర్నూల్, అనంతపురం వైయస్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.