FASTag Annual Pass: జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద విజయవంతంగా అమలు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ స్కీమ్‌కు విపరీతమైన స్పందన లభించింది. తొలి రోజే ఏకంగా 1.4 లక్షల మంది ఈ పాస్‌ను కొనుగోలు చేసుకున్నారు. అదే రోజు సుమారు 1.39 లక్షల లావాదేవీలు టోల్ ప్లాజాలలో నమోదయ్యాయి. ఇక రాజ్ మార్గ్ యాత్ర యాప్ ను ఒకే సమయంలో 20-25 వేల మంది యూజర్లు సమాంతరంగా ఉపయోగిస్తున్నారని NHAI తెలిపింది. వార్షిక పాస్ వినియోగదారులకు టోల్ ఫీజు కోత లేకుండా వెళ్లినట్టు SMS సమాచారం అందుతోంది.
Bollywood : 51 ఏళ్ల వయసులో.. రెండో పెళ్లికి రెడీ అయిన హాట్ హీరోయిన్..!
ఇక ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ పాస్ ద్వారా వాహనదారులు 200 టోల్ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సర కాలపరిమితి (ఏది ముందుగా పూర్తి అయితే అది) వరకు లావాదేవీలు చేయకుండా ప్రయాణం చేయగలరు. ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్‌లాగే కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ సౌకర్యం ఉంటుంది. ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్న వారు కొత్త ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌గా అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ధర రూ.3,000 మాత్రమే. దీని చెల్లింపులు క్రెడిట్ కార్డు, UPI, నెట్ బ్యాంకింగ్ వంటి పద్ధతుల ద్వారా చేయవచ్చు. పాస్ గడువు ముగిసినా లేదా టోల్ పరిమితి పూర్తయినా, యూజర్లు సాధారణ ఫాస్టాగ్‌లానే తిరిగి రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ వార్షిక పాస్ ఆప్షనల్ సర్వీస్‌గా అందుబాటులో ఉంది. ప్రస్తుత ఫాస్టాగ్ వినియోగదారులు తమకు నచ్చిన విధంగానే కొనసాగవచ్చు. వార్షిక పాస్ తీసుకోవాలనుకునే వారు రాజ్ మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI/MoRTH వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
Asim Munir: దేవుడు నన్ను రక్షకుడిని చేశాడు.. నాకు ఏ పదవి వద్దు..
అందులో వాహన నంబర్, ఫాస్ట్‌ట్యాగ్ ఐడీ ఎంటర్ చేసి వివరాలు నింపి, రూ.3,000 ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చాక పాస్ వెంటనే అమలు అవుతుంది. ఈ విధంగా, ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ రాకతో వాహనదారుల టోల్ చెల్లింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.