Rain Alert In AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు.
Minister Anitha: ఏపీకి 'మొంథా తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేసింది.
AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొనింది. మధ్యాహ్నానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.
Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం.. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. FASTag Annual Pass: అదరగొట్టిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక…
ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్…
Weather Report: ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ నేడు (ఆదివారం) ఒక ప్రకటనలో భాగంగా.. సోమవారం (ఏప్రిల్ 14) రోజున రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (11) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.…