వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. సుమారు 16 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి విక్రయించినట్లు గుర్తించిన అధికారులు దేశవ్యాప్తంగా కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా.. NTVతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. మొత్తం 16 కోట్ల 8 లక్షల డేటా చోరీ చేశారని, దేశ భద్రత కు డేటా చోరీ తో ముప్పు ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న డేటా బ్రోకర్స్ పై విచారణ చేస్తామని ఆయన వెల్లడించారు. యూనిఫారం సర్వీసెస్ లో అత్యంత గోప్యంగా ఉండాల్సిన వారి వివరాలు కూడా చోరీ అయ్యాయని ఆయన తెలిపారు.
Also Read : CM KCR : నేనూ రైతునే.. నాకూ ఆ బాధ తెలుసు
కొన్ని వెబ్‌సైట్స్ లో డేటా బ్రోకర్స్ రిజిస్టర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి డేటా చోరీ అయ్యిందని, డేటాను గోప్యంగా ఉంచాల్సిన ఏజెన్సీలే బయటి వ్యక్తులకు అమ్ముకున్నాయని ఆయన తెలిపారు. జస్ట్ డయల్ పై లోతుగా దర్యాప్తు చేస్తామని, స్పెషల్ టీమ్స్‌తో దర్యాప్తు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నట్లు, విచారణ పూర్తయ్యాక, అవసరం అనుకుంటే కేంద్ర హోం శాఖ కు లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read : Samsung Galaxy A54 5G: అదిరే ఫీచర్లతో కొత్త మోడల్స్… స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే