CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస గాయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన మెక్నీల్ హాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ ఐపీఎల్ అరంగేట్రం చేశారు. అయితే.. అదే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కింద పడటంతో అతని కుడి కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ధృవీకరించిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్, నోరోన్హాను జట్టులోకి తీసుకునేందుకు బీసీసీఐ అనుమతి కోరినట్లు తెలిపారు.
ఎవరీ నోరోన్హా?
24 ఏళ్ల నోరోన్హా కర్ణాటక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది జరిగిన మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరపున ఆడిన అతను.. 13 మ్యాచ్‌ల్లో 148.82 స్ట్రైక్ రేట్‌తో 253 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 19 సిక్సర్లు బాది తన పవర్ హిట్టింగ్ సత్తా చాటాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 10 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా మెరిశాడు. అతని నిలకడైన ఆట తీరుతో కర్ణాటక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. రామకృష్ణ ఘోష్ దూరం కావడంపై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విచారం వ్యక్తం చేశారు. “ఘోష్ చాలా వేగంగా ఎదుగుతున్నాడు. అతను కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాటింగ్‌లోనూ మెరుగుపడి మంచి ఆల్‌రౌండర్‌గా తయారవుతున్నాడు. ఈ సమయంలో అతను గాయపడటం జట్టుకు పెద్ద లోటు” అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
Also Read
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
- Team India Selection: బీసీసీఐ కీలక మీటింగ్.. యువ పేసర్లకు ఛాన్స్, సీనియర్లకు షాక్ తప్పదా?
- KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
కష్టాల్లో చెన్నై..
ఈ సీజన్ చెన్నైకి గాయాల సీజన్‌గా మారింది. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, ఆయుష్ మ్హాత్రే వంటి ఆటగాళ్లు గాయపడగా, స్టార్ ప్లేయర్ MS ధోనీ కూడా కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ విభాగంలో నాథన్ ఎల్లిస్ అందుబాటులో లేకపోవడం, స్పెన్సర్ జాన్సన్ ఆలస్యంగా చేరడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నోరోన్హా రాక చెన్నై జట్టుకు ఎంతవరకు బలాన్నిస్తుందో వేచి చూడాలి.
అయితే ఎంత మంది వచ్చినా.. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్లే ఆఫ్స్ కు వెళ్లడం ఖాయం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ జట్టు మే 18న చెన్నైలోనే సీఎస్కేతో తలపడనుంది.
తాజావార్తలు
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!