Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేసే మెసేజ్‌లు ఎప్పుడూ విభిన్నంగా, ఆలోచింపజేసేలా ఉంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గాలికి వంగిపోయినా, పడిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఆకృతిని సంతరించుకున్న ఒక చెట్టును ఉదాహరణగా చూపుతూ.. ఆయన చెప్పిన జీవిత పాఠం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..
ఈ వీడియోలో ఒక ఎడారి లాంటి ఎండారు ప్రాంతంలో ఒంటరిగా నిలబడ్డ ఒక చెట్టు కనిపిస్తుంది. అక్కడ నిరంతరం వీచే బలమైన గాలుల కారణంగా ఆ చెట్టు ఒక వైపునకు పూర్తిగా వంగిపోయింది. కానీ, అది నేలకూలలేదు, వేళ్లతో సహా ఊడిపోలేదు. గాలి ఎటు వీస్తే అటు తనను తాను మలచుకుని, ఇప్పుడు ఒక అద్భుతమైన ‘లివింగ్ స్కల్ప్చర్’ (సజీవ శిల్పం)లా కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా తన మనసులోని మాటను ఇలా రాసుకొచ్చారు.. “ఈ ప్రకృతి మనకు నిరంతరం ఏదో ఒక సందేశాన్ని పంపుతూనే ఉంటుంది. ఈ చెట్టును చూడండి.. నిరంతర వీచే గాలుల ఒత్తిడిని తట్టుకుని మరీ నిలబడింది. అది విరిగిపోలేదు, బదులుగా ఆ గాలి వాటానికే తనను తాను మలచుకుంది. ఆ కష్టాలే దానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని, గుర్తింపును ఇచ్చాయి. మన జీవితంలో వచ్చే కష్టాలు, విషాదాలు కూడా అంతే.. అవి మనల్ని నాశనం చేయవు, మన వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని మరింత దృఢంగా మలుస్తాయి” అని చెప్పారు.
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
సోమవారం ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరింది. నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని థిగ్మోమార్ఫోజెనెసిస్ అని పిలుస్తారని.. గాలి లేదా తాకిడి వంటి మెకానికల్ స్ట్రెస్ వల్ల మొక్కలు మరింత బలంగా మారుతాయని విశ్లేషిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. “మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచిన తీరు ఈ చెట్టులాగే ఉంది” అని, “పునాది (Roots) బలంగా ఉంటే ఎంతటి తుపానునైనా ఎదుర్కోవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ చెట్టు మనకు నేర్పిన పాఠం ఏంటంటే.. కష్టాలు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ, మన విలువలు, ఆత్మవిశ్వాసం అనే వేళ్లు బలంగా ఉంటే.. ఆ కష్టాలే మనల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడతాయి.
When I saw this video, my first thought was that the earth, very often, sends us messages.
This tree, facing constant winds, is still standing, & has neither fallen nor been uprooted.
Instead it’s been shaped by it.
And developed its own unique aesthetic & identity.
We… pic.twitter.com/68f3ONqooy
— anand mahindra (@anandmahindra) May 11, 2026
తాజావార్తలు
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!