CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: యావత్ దేశ వ్యాప్తంగా ఇప్పుడు ‘దళపతి’ విజయ్ పేరు మార్మోగిపోతోంది. కొన్నేళ్లుగా వెండితెరపై తన చిత్రాలతో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఈ తమిళ స్టార్ హీరో తాజాగా జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో దేశవ్యాప్తంగా విజయ్ పేరుకు విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ప్రభావం ఇప్పుడు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ డేటాబేస్ ఐఎండీబీ (IMDb) రిలీజ్ చేసిన ‘పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక్కవారంలోనే 21 నుంచి 2వ స్థానానికి..
ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 250 మిలియన్ల మంది సందర్శించే ఐఎండీబీ పోర్టల్‌లో సెలబ్రిటీల పేజీలకు వచ్చే వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. గత వారం ఈ జాబితాలో 21వ స్థానంలో ఉన్న తమిళనాడు స్టార్ హీరో విజయ్, ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. కేవలం ఒక సినిమా స్టార్‌గానే కాకుండా, ఇప్పుడు పొలిటికల్ లీడర్‌గా, తమిళనాడు సీఎంగా విజయ్ తన పాపులారిటీని నిరూపించుకున్నారు. ఈ జాబితాలో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘సప్నే Vs ఎవ్రీవన్ సీజన్:2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విశేష ఆదరణ పొందుతుండటంతో ఆయన టాప్‌లోకి వచ్చారు. ఈ లిస్ట్‌లో టాలెంటెడ్ నటి సాయిపల్లవి ఏడో స్థానంలో నిలిచారు. జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. సినిమా వ్యాపారంతో సంబంధం లేకుండా కేవలం ప్రజాదరణ, సోషల్ మీడియా సెర్చ్‌ల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో సౌత్ సెలబ్రిటీలు ఆధిపత్యం చెలాయించడం విశేషం.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!