CPM : ఈనెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM : ఈనెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరీ నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. వేలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బీజేపీ, వైసీపీలు తమ ప్రచార కర్తలుగా మార్చుకుంటున్నారన్నారు. మోడీ పాలనలో దేశం విలపిత భారత్‌గా మారిందన్నారు. మాటల మరాఠీ మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి అన్ని విధాలా అన్యాయం చేసిందని తెలుసన్నారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ధి పొందడానికి కృష్ణా జలాలపై ప్రకటనలు చేశారన్నారు. ప్రశ్నించడానికే జనసేన అని పవన్ కళ్యాణ్ మాట్లాడారని.. కానీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ప్రజల ఎజెండాతో సాగుతున్న ప్రజా రక్షణ భేరికి లక్ష మంది తరలి రానున్నారని చెప్పారు. 26 జిల్లాల్లో మేము యాత్ర చేశామని.. ఎక్కడా జగన్ కావాలని ఎవరూ చెప్పలేదన్నారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే పదమే నోరు తిరగడం లేదన్న ఆయన… ఇక సామాన్య ప్రజలకు ఏమి అర్ధం అవుతుందని ప్రశ్నించారు.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
ఏజెన్సీ ప్రాంతాల్లో నాడు నేడు, జగనన్న ఇళ్లు లేవని.. గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనులు ముప్పై కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎవరైనా అడిగితే.. నోటికొచ్చిన బూతులు తిడతారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను రేపు సభలో వివరిస్తామన్నారు. వైసీపీ మద్యం అవినీతిపై కేంద్రానికి పురంధరేశ్వరి లేఖపై కేంద్రం స్పందించడం లేదంటే ఏమనుకోవాలన్నారు. బీజేపీ, వైసీపీ కపట నాటకాలను ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీకి మద్దతుగా ఉండే పార్టీలను ప్రజలు ఓడించాలన్నారు.
ఈ నెల 15న జరిగే ప్రజా రక్షణ భేరికి అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారని సీపీఎం నేత బాబూరావు పేర్కొన్నారు. ఫుడ్ జంక్షన్ నుంచి సింగ్ నగర్ స్టేడియం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. సభకు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, ఇతర నేతలు వస్తున్నారన్నారు. ఎర్ర సైనికులతో కవాతు ఉంటుందన్నారు. 32 అంశాలను ఇప్పటికే ప్రజల్లో పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను సభలో వివరిస్తామన్నారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన తీరు చెబుతామన్నారు. అంశాల వారీగా ప్రభుత్వాలు చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఇతర పార్టీల సభల్లా కాదు.. కార్యకర్తలు సొంత ఖర్చులతో సభకు చేరుకుంటున్నారని బాబూరావు తెలిపారు. రేపు రాత్రికి మా పార్టీ కేంద్ర నాయకులు విజయవాడ చేరుకుంటారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?