మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఈనెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరీ నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. వేలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బీజేపీ, వైసీపీలు తమ ప్రచార కర్తలుగా మార్చుకుంటున్నారన్నారు.
CPM Srinivasa Rao Slams AP Govt over farmers: రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే.. రాజకీయాల్లో భాగంగా నాయకులు యాత్రలు చేస్తున్నారు అని ఆంద్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. 15 సంవత్సరాలలో తీవ్ర స్థాయిలో పంటలు ఎండిపోయాయని, ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరుగుతున్నాయన్నారు. రేపటి నుచి ప్రజారక్షణ భేరి ప్రారంభం అవుతుందని, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు ఆశోక్ థావలే కర్నూలు నుంచి ప్రజారక్షణ భేరీ ప్రారంభిస్తారు అని శ్రీనివాసరావు…