చాంద్రయాన్ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ గాజి ఏ మిల్లత కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓవైసీకి స్థానిక ప్రజలు స్వాగతం పలుకుతూ సన్మానాలు చేశారు. ఇక, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు డాక్టర్ నూర్ ఉద్దీన్ ఓవైసీ కూడా పర్యటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Amit Shah: అధికారంలోకి వస్తే అయోధ్య దర్శనం ఉచితం.. అమిత్ షా ఆఫర్
అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మా జోలికి రావొద్దు వస్తే నీ జీవిత చరిత్ర బట్టబయలు అవుతుందని చెప్పుకొచ్చారు. కావాలంటే నన్ను, మా అన్న అసదుద్దీన్ ఓవైసీని తిట్టు నీ రాజకీయా ఎత్తులను మేము చిత్తు చేస్తామని ఆయన తెలిపారు. మా తమ్ముడికి రాజకీయాల గురించి తెలియదు కాబట్టి కుటుంబం దగ్గరికి రావొద్దు వస్తే బాగుండదు అని అక్బరుద్దీన ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుండి నిన్ను( రేవంత్ రెడ్డి) ఆర్ఎస్ఎస్ టిల్లు అని పిలవాలి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముందు ఆర్ఎస్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.
Read Also: Harish Rao Exclusive Interview: కాసేపట్లో.. ఎన్టీవీ లైవ్‌లో మంత్రి హరీశ్ రావు..
తెలంగాణలో రెడ్డి, రావు ఎవరైనా సరే మా దగ్గర వంగాలి అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారత దేశంలో ప్రతి హిందూ- ముస్లింల గొడవలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన వ్యాఖ్యనించారు. ఇప్పటి వరకు 55 మతపరమైన గొడవలకు కారణం కాంగ్రెస్సే.. నెహ్రూ దేశ విభజన వల్లనే భారత్-పాకిస్థాన్ రెండు భాగాలు అయ్యింది.. లేకుంటే ఒకే దేశం ఉంటుందే అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Mangalavaram: జీరో ఎక్స్‌పోజింగ్.. ట్విస్టులకు దిమ్మతిరుగుతుంది
వాహద్ ఓవైసీనీ 11 నెలలు జైలులో ఉంచారు.. సలర్ ను కూడా జైలుకు పంపించారు.. అసదుద్దీన్ ఓవైసీపై కేసులు పెట్టారు.. నన్ను నిజామాబాద్ జైలులో ఉంచారు అని అక్బరుద్దీన్ అన్నారు. నా కుటుంబ సభ్యులను కూడా కలవనియ్యలేదు నాకు ట్రీట్మెంట్ చేయలేదంటే దానికి కారణం కాంగ్రెస్సే.. కాబట్టి రేవంత్ రెడ్డి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని ఆయన అన్నారు.. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే.. ఈ నెల 30వ తేదీన పతంక్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.