రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు తీవ్రతపై సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5300 కోట్లు కేటాయించి, నిర్మాణం చేపట్టడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంటూ కేంద్ర బిజెపి మరో నాటకానికి తెరలేపిందన్నారు. ఏపీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.. ప్రాజెక్టులలో నీళ్లు లేవన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై నవంబర్ 1న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశమన్నారు. నవంబర్ 2వ తేదీ నుండి సిపిఐ రాష్ట్ర నాయకత్వం 18 కరవు జిల్లాల్లో పర్యటిసున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలన్నారు.
Also Read : Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు
అంతేకాకుండా.. ‘నవంబర్ 8 నాటికి విశాఖ ఉక్కు పోరాటం 1000 రోజులకు చేరుతోంది. నవంబర్ 8న విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్య సంస్థల బంద్ కు సిపిఐ మద్దతు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లను 6 వేలకు పెంచాలి. లిక్కర్ సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నారు. విద్యుత్ ఒప్పందాలు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. అదానీ కంపెనీలకే అన్ని కాంట్రాక్టులు అప్పగించడం వెనుక మర్మమేమిటి?. సామాజిక బస్సుయాత్ర పేరుతో వైసిపి మరో మోసానికి తెరతీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పథకాల్లో కోత విధించిన జగన్ సర్కార్ సామాజిక న్యాయం సాధిస్తుందా?’ అని సీపీఐ రామకృష్ణ అన్నారు.
Also Read : Mother Sues Son: చదువుకు డబ్బులు ఇస్తే.. లవర్ కోసం కారు కొన్నాడు.. దీంతో కొడుకుపై కోర్టుకెళ్లిన తల్లి