ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రవాల్ సీపీఐ ఆఫీస్ కి వచ్చి డీ రాజాను, తనను కలిశారని తెలిపారు సీపీఐ నేత నారాయణ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని, ఎన్నికైన ప్రభుత్వం ఉండగా ప్రభుత్వాన్ని కాదని వారు నామినేట్ చేసిన గవర్నర్ ద్వారా పాలన కొనసాగించాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలా మాత్రమే ఉంటున్నారని, వంటింట్లో వంట మనిషి కేజ్రీవాల్ ను కొట్టినా, అతను కేసు పెట్టలేడన్నారు. అంతేకాకుండా.. ‘మరలా సెంట్రల్ గవర్నమెంటే కేసు పెట్టాలి. ఇంత ఘోరమైన పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా లేదు.
Also Read : Adikeshava: మెగా మేనల్లుడిని కూడా తన అందంతో బుట్టలో పడేసిందమ్మా..
ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు మర్యాద లేకుండా పోతుంది. ప్రజల చేత ఎన్నికైన. ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండాలి. గవర్నర్ పదవి కేవలం నామినేటెడ్ పదవి మాత్రమే. ఢిల్లీ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. పాట్నాలో 23వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఆల్ పార్టీ మీటింగ్ కి సిపిఐ జనరల్ సెక్రెటరీ రాజా హాజరవుతారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై ఐటి రైడ్స్ చేస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపికి దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కేసీఆర్, చంద్రబాబు బీజేపీకి సపోర్ట్ చేస్తే మేము ఆ రెండు పార్టీలకు సపోర్ట్ చేయం. అమిత్ షా తెలంగాణ పర్యటన వెళ్తున్నారు అక్కడ నిరసన తెలియజేయాలని
సీపీఐ నేతలకు పిలుపునిచ్చాం’ అని నారాయణ వ్యాఖ్యానించారు.
Also Read : Internet Economy: ఇది భారత్ డిజిటల్ సత్తా.. 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న “ఇంటర్నెట్ ఎకానమీ”..