Adikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్న వైష్ణవ్ ఈ సినిమా తరువాతమరో హిట్ ను అందుకున్నది లేదు. ఇక ఎలాగైనా ఉప్పెన లాంటి హిట్ ను కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మొదలుపెట్టాడు. అదే ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ సరసన అందాల భామ శ్రీలీల నటిస్తోంది. ఇక నేడు ఈ చిన్నదాని పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే నేటి ఉదయం ఈ చిన్నదాని పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన మేకర్స్ తాజాగా ఆమె బర్త్ డే గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. వీడియో గ్లింప్స్ లో శ్రీ లీల తన అందంతో ఆకట్టుకొంటుంది. మాస్ హీరోగా విలన్స్ ను చితకబాదిన ఆదికేశవను కూడా తన అందంతో బుట్టలో వేసుకొని వెనుక తిప్పించేకున్నట్లు చూపించారు.
Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
ఇక వీడియోలో సైతం వైష్ణవ్ .. ఆమెకు హ్యాపీ బర్త్ డే అని చెప్పడం.. ఆమె సాయంత్రం పార్టీకి రమ్మని పిలవడం చూపిస్తూనే.. మధ్య మధ్యలో ఆమెను ఇంప్రెస్ చేయడానికి వైష్ణవ్ పడిన కష్టాలను చూపించారు. ఇక ఇందులో వైష్ణవ్.. ఒక సేల్స్ బాయ్ గా పనిచేస్తున్నట్లు కనిపించాడు.. ఒక ఫేస్ క్రీమ్ ను శ్రీలీలకు ఇచ్చి ఇది వాడండి అనడం.. ఆమె నాకు అవసరం లేదు అని చెప్పడం.. వెంటనే మనోడు.. అవును మీకెందుకు.. న్యాచురల్ బ్యూటీ అని పులిహోర కలపడం ఆకట్టుకుంటుంది. ఇక చివర్లలో రాధిక.. బర్త్ డే పార్టీకి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అని అడిగితె .. వైష్ణవ్ ఫ్రెండ్ .. చెరొక వెయ్యి వేసుకొని రైస్ కుక్కర్ తీయిస్తాం ఆంటీ అని చెప్పడం.. దానికన్నా తక్కువ దోమల బ్యాట్ అయితే ఇంకా బావుంటుంది అని వైష్ణవ్ కౌంటర్ వేయడం బావుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో.. శ్రీలీల లక్ కలిసొచ్చి వైష్ణవ్ కు హిట్ అందుతుందేమో చూడాలి.