అంతా అయిపోయింది.. ఇక మనం సేఫ్ అనుకున్నాం. కానీ కరోనా మహమ్మారి మాత్రం నేనున్నానని.. మీరేం సేఫ్ కాదంటోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసులు ఏమి నమోదు కాలేదు.. గత నెల రోజుల క్రితం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.. మరోవైపు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరిన పోసాని పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చారు. పోసానికి కరోనా రావడం ఇది మూడోసారి ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: SRH vs KKR: శతక్కొట్టిన బ్రూక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలో 11, పశ్చిమ గోదావరిజిల్లాలో 2కేసులు నమోదు అయ్యాయి. ఏలూరు జిల్లాలో చింతల పూడి రూరల్ పరిధిలో చింతలపూడి, వెంకటాపురం, ఉర్లగూడెం, ఊటసముద్రంలో ఒక్కొక్కటి, ఏలూరు అర్బన్ పరిధిలో పత్తేబాద, తాపీమేస్త్రీకాలనీలో ఒక్కొక్కటి, నూజి వీడు రూరల్ పరిధి గొల్లపల్లిలో రెండు, కోనేరుపేటలో ఒకటి, ఉంగుటూరు రూరల్ పరిధి ఉంగుటూరు, రావులపర్రులలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం రూరల్ పిప్పర, తాడేపల్లిగూడెంలో ఒక్కొక్క కొవిడ్ కేసు నమోదయ్యాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా సంగతికి వస్తే జిల్లా వ్యాప్తంగా 20 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాజులూరు పీ హెచ్ సి పరిధిలో…8,ఎస్. యానం లో…6,బలుసుతిప్ప…3,బండారులంక…1, పల్లంకుర్రు…1, ద్వారపూడి…1 నమోదయ్యాయి. వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇటు నెల్లూరు జిల్లాలో రెండు కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Also: Fairy Tale Forests: ఇవి అడవులు కావు.. భూతల స్వర్గాలు
ఉమ్మడి కృష్ణ జిల్లాలో 6 కేసులు నమోదు కాగా, విజయవాడ ప్రభుత్వసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు… ఇటు తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 18 కేసులు నమోదు అవడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. మొత్తం మీద కరోనా కేసుల విషయంలో జాగ్రత్తలు అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.