Sunrisers Hyderabad Scored 228 In 20 Overs Against KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. ఈ సీజన్‌లోనే ఇది హయ్యస్ట్ స్కోర్. తొలి మూడు మ్యాచ్‌ల్లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన కాస్ట్‌లీ ఆటగాడు హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 100 నాటౌట్ ) సెంచరీతో శివాలెత్తడం, కెప్టెన్ మార్ర్కమ్ (26 బంతుల్లో 50) అర్థశతకంతో చెలరేగడంతో.. సన్‌రైజర్స్ ఈ స్థాయిలో భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అభిషేక్ శర్మ (17 బంతుల్లో 32), హెన్రిచ్ క్లాసెన్ (6 బంతుల్లో 16 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించి.. జట్టుకి భారీ స్కోరు అందించడంలో తమవంతు పాత్ర పోషించారు.
Madhu Yashki : లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు
తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఓపెనర్‌గా క్రీజులో అడుగుపెట్టిన బ్రూక్.. వచ్చినప్పటి నుంచే బాదుడు మొదలుపెట్టాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా.. ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విజృంభించాడు. మయాంక్ అగర్వాల్ (13 బంతుల్లో 9), రాహుల్ త్రిపాఠి (4 బంతుల్లో 9) మాత్రమే నిరాశపరచగా.. మిగిలిన బ్యాటర్లందరూ దుమ్ముదులిపేశారు. మార్క్రమ్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. బ్రూక్, మార్క్రమ్ కలిసి.. మూడో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మార్క్రమ్ ఔటయ్యాక హ్యారీ మరింత చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. అతనితో పాటు అభిషేక్ కూడా క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టు బౌలర్లపై తాండవం చేశాడు.
Tamarind Leaves: చింత చిగురు తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ మటుమాయం
అభిషేక్ ఔటయ్యాక వచ్చిన క్లాసెన్ సైతం బంతులు వేస్ట్ చేయకుండా.. బౌండరీలు మలిచాడు. మయాంక్, త్రిపాఠి మినహా.. వచ్చిన ప్రతీ బ్యాటర్ ఖాతా తెరువడంతో.. హ్యారీ బ్రూక్ శతక్కొట్టడంతో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్ల విషయానికొస్తే.. ఈరోజు రసెల్ మెరిశాడు. 2.1 ఓవర్లు వేసిన అతగాడు.. 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు. అయితే.. బౌలర్లందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయలేకపోయారు. మరి.. బ్యాటింగ్‌లో కేకేఆర్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన భారీ టార్గెట్‌ని ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!