ఏపీ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై సినీ ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి .. జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి చాలామంది స్టార్లు గైర్హాజరు అయినా విషయం తెల్సిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం…
చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న జయసుధ కొద్దిగా కోలుకున్నారని సంతోషపడేలోపు ఈ మహమ్మారి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక జయసుధ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి…
ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తాజాగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 20 మందికి పైగా మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పొజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన విద్యార్దులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 120 మంది విద్యార్థులు వున్నారు. కొంతమందిని హోం ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరికొంత మందికి రిమ్స్ లోనే చికిత్స అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెల్సిందే. దీనిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశామని.. కరోనా కేసులతో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తూ… ఉచిత మెడికల్ కిట్ లను అందిస్తున్నామని ప్రకటన చేశారు. Read Also: ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు:…
చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.…
చిత్ర పరిశ్రమలో కరోనా విలయతాండవం చేస్తోంది. స్టారలందరు ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు హీరోయిన్ వారలక్షిమి శరత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో ఎక్కువ మందిని కరోనా అతలాకుతలం చేసింది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడ్డారు.. అందులో ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలారు.. తాజాగా, లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్ఖా సింగ్ కోవిడ్ బారినపడ్డారు.. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది.. ఆయన వయస్సు 91 ఏళ్లు..అయితే, ఆయన పరిస్థితి నిలకడగానే ఉండడంతో.. చండీగఢ్ సెక్టార్…
కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…
కరోనా మహమ్మారి ఉధృతి దేశంలో ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 15 రాష్ట్రాల్లో లాక్ డౌన్, కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న తరుణంలో కొంతమేర పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు రెమ్ డెసీవర్ మెడిసిన్ వాడుతున్నారు. ఇలా స్వల్ప లక్షణాలు ఉన్న…