బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో శ్రద్ధాకపూర్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల ‘స్త్రీ 2’ మూవీతో హిట్ అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్‌లలో మాత్రమే అలరించిన శ్రద్ధా ను స్త్రీ2 లో ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపించింది. తన యాక్టింగ్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఈ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్, శ్రద్ధాకపూర్‌ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడంపై స్పందిస్తూ .. షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.
Also Read: Tamannaah : ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను..
‘ ‘స్త్రీ’ మూవీ లో కథానాయికగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా? అని మేము ఎంతగానో ఆలోచించాం. చివరకు శ్రద్ధాకపూర్ ఓకే అయ్యింది. ఆమె ను ఎంపిక చేసింది నేను కాదు. ఆ నిర్ణయం పూర్తిగా నిర్మాత దినేశ్ విజయ్‌దే. ఆమెను ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా ఆయన నాతో చెప్పారు. ఓసారి శ్రద్ధాకపూర్, దినేశ్ ఒకే ఫ్లైట్లో ప్రయాణించారట. చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారట. ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని.. అందువల్ల ఈ పాత్రకు తాను అయితే పూర్తి న్యాయం చేయగలదని ఆయన నాతో చెప్పారు’ అని అమర్ కౌశిక్ వెల్లడించారు. ఎంతైన ఒక స్టార్ హీరోయిన్ ని పట్టుకుని ఇలాంటి స్టెట్‌మోంట్ ఇవ్వడం పై నెటిజన్లు అభిమానులు కొంత ఫైర్ అవుతున్నారు.