Bandi Sanjay: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా.. కనీసం సీఎం చేశారా?
- కాంగ్రెస్ సభ పేరును ‘‘సామాజిక అన్యాయ సమర భేరీ’’గా మార్చుకోండి..
- 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా.. కనీసం సీఎం చేశారా?..
- లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఓర్వలేకేపోతున్నారు: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సభ పేరును ‘‘సామాజిక అన్యాయ సమర భేరీ’’గా మార్చుకోండి అని సూచించారు. ఏం ఉద్దరించారని సభ పెడుతున్నారు? అని అడిగారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా?.. అర్ధశతాబ్ద కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని సీఎం చేశారా?.. దళిత, బడుగు, బలహీన వర్గాలకు మేలు కలిగేలా 6 గ్యారంటీలను కూడా అమలు చేయలేకపోయారే? అంటూ మండిపడ్డారు. జనాభాలో సగమున్న బీసీలకు కేబినెట్ లో ఎన్ని మంత్రి పదవులిచ్చారు? అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవిస్తే బీసీల గొంతు వినిపిస్తున్నారు.. మరిందరూ బీసీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేశారు. ఏ ముఖం పెట్టుకుని సమర భేరీ నిర్వహిస్తున్నారు? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
ఇక, ప్రజలకు ఏఐసీసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలి అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అడిగిన దానికంటే అదనంగా యూరియా ఇచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? అని మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఓర్వలేకే యూరియా కొరత పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధికారులు తప్పు దోవ పట్టిస్తున్నారు అని ఆరోపించారు. అదనపు యూరియా ఇచ్చే విషయాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోంది.. ఇకనైనా వాస్తవాలు ప్రజల ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని బండి సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..