Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- స్కూటర్‌పై పడిన భారీ రైన్ వాటర్ పైపు
- 15 రోజుల క్రితమే కొన్న స్కూటీ ధ్వంసం
- హెల్మెట్‌తో బైకర్‌కు తప్పిన ప్రాణాపాయం
- ఫ్లైఓవర్‌పై భద్రతా తనిఖీలకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద మరోసారి ఘోర ప్రమాదం తృప్తిలో తప్పింది. ఫ్లైఓవర్ పైభాగం నుంచి వర్షపు నీరు కిందకు వెళ్లేందుకు అమర్చిన ఒక భారీ ‘రైన్ వాటర్ వెంట్ పైపు’ అకస్మాత్తుగా ఊడిపోయి, కింద రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూటర్‌పై నేరుగా పడింది. ఈ ప్రమాద ధాటికి స్కూటర్ ముందు భాగం పూర్తిగా నజ్జునుజ్జయింది. అయితే అదృష్టవశాత్తూ వాహనదారుడు హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డాడు. కేవలం 15 రోజుల క్రితమే కొనుగోలు చేసిన కొత్త స్కూటీ ఇలా కళ్లముందే ధ్వంసమైపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
పునరావృతమవుతున్న ఘటనలు.. అధికారుల నిర్లక్ష్యం
షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై పైపులు ఊడిపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే ఫ్లైఓవర్ నుంచి డ్రైనేజీ, వర్షపు నీటి పైపులు కింద ప్రయాణిస్తున్న వాహనదారులపై పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లోనూ ప్రయాణికులు అదృష్టవశాత్తూ ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వరసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఫ్లైఓవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పదేపదే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు.
Also Read
- Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
- CP Mahesh Bhagwat: "అదే నా మొదటి ప్రాధాన్యత".. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
- KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
వెంటనే తనిఖీలు చేపట్టాలని స్థానికుల డిమాండ్
నగరంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఈ తరహా ప్రమాదాలు జరగడం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఫ్లైఓవర్‌పై ఉన్న అన్ని పైపులు, రైన్ వాటర్ వెంట్లు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయో అధికారులు వెంటనే సమగ్రంగా తనిఖీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లైఓవర్ మెయింటెనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?