Bandi Sanjay : కవితకు బెయిల్ ఇప్పిస్తోంది కాంగ్రెస్సే
- లిక్కర్ కేసు వాదించడం వెనుక ఆంతర్యమేంది?
- అందుకే సింఘ్వీని తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారు
- ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు.
ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ సమీపంలోని రావిరాల గ్రామంలో నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే… రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నా. పదేపదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడింది. కాంగ్రెస్ నేతలే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీయే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇఫ్పించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నాడు. ఇదిగో ఆధారం…. (ఆధారం చూపుతూ..)
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Oldest woman in the world: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ.. ఆమె జీవిత రహస్యాలు ఇవే..
అభిషేక్ సింఘ్వీ పెద్ద వకీలు. అనుభవజ్జుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్ లో గట్టిగ వాదిస్తడని అనుకున్నా. కానీ తీరా చూస్తే… లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నడు. అభిషేక్ సింఘ్వీ లాయర్ కాబట్టి కేసులు వాదించడంలో తప్పు లేదు.. కానీ ప్రత్యర్థి పార్టీ లిక్కర్ కేసులో జైలుకు పోతే వాదించడం ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారో అర్ధం చేసుకోవాలి.
PM Modi: ప్రధాని మోడీ సరికొత్త పంథా.. ఉక్రెయిన్‌కు ఎలా వెళ్లనున్నారంటే…!
కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలే… ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం… జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదు? ఎందుకంటే కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి కాబట్టి. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారు. రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ. ఆ పార్టీతో పొత్తు ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. కాబట్టి కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం తధ్యం.
అవినీతి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే. అయితే బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నయి. మేం 6 గ్యారంటీలు, రుణమాఫీపై నిలదీస్తుంటే… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజీవ్ గాంధీ విగ్రహం పేరుతో లొల్లి చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన గుణ పాఠం చెబుతారు. బీజేపీయే కవితకు బెయిల్ ఇప్పిస్తోందని చెప్పడం దుర్మార్గం. బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? కాంగ్రెస్ మాదిరిగా కోర్టులో కవిత బెయిల్ కోసం వాదిస్తున్నమా? బెయిల్ ఇచ్చేది కోర్టులు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదని హెచ్చరిస్తున్నా.. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై కేంద్రం ఇప్పటికే స్పందించింది. నేను కోరేదోక్కటే హిందూ సమాజం జాగ్రుతం కావాలి. జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలి. హిందూ సమాజమంతా సంఘటితం కావాలి.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!