AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త కమిషనరేట్లతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం కానుంది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో రూ.1,548.98 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అలాగే LPS రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనలను సవరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. దాచేపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌కు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. శ్రీసిటీలో క్యాటర్‌పిల్లర్ గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కుప్పంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడేలా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైనా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు దశల వారీగా జరుగుతాయని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. ఎన్నికలకు సమయం వృథా చేసుకోకుండా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. అవాస్తవ ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ మరికొంత సమయంలోగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పరిస్థితిపైనా కేబినెట్ చర్చించింది. వర్షాల ప్రభావం, రైతులకు కలిగే ప్రయోజనాలు, అవసరమైన చర్యలపై మంత్రులు చర్చించారు. ఎల్‌నినో అంశంపైనా కేబినెట్ ఎజెండా అనంతరం కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!