ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ(117) మరియా బ్రన్యాస్ మోరేరా కన్నుమూశారు.
ఆమె నిద్రలోనే ఎలాంటి బాధ లేకుండా ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని కుటుంబీకులు తెలిపారు.
మరియా మార్చి 4, 1907న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు.
ఆమె జన్మించిన ఎనిమిది సంవత్సరాల తరువాత, తల్లిదండ్రులు అమెరికా నుంచి స్పెయిన్‌కు వచ్చారు.
మరియా ప్రపంచ యుద్ధాలు, స్పానిష్ అంతర్యుద్ధం, స్పెయిన్‌లోని ఫ్లూ మహమ్మారి ఆమెను ఏం చేయలేదు.
వయసు పైబడినప్పటికీ మరియా సామాజికంగా చాలా చురుకుగా ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరియా మంచి జన్యువులు, జీవనశైలి తన సుదీర్ఘ జీవితానికి కారణమని భావించింది.
తన జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని, మానసికంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందని ఆమె చెబుతుండేవారు.
సుదీర్ఘ జీవితానికి, మంచి జీవనశైలితో పాటు సమతుల్య.. ప్రశాంతమైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యమని చెప్పేవారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండాలనే వారు.
జీవితంలో దేనికీ పశ్చాత్తాపపడనని, సానుకూలంగా ఉంటానని, నమ్మించి మోసం చేసేవారికి దూరంగా ఉంటాననే వారు.