Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ellipaya Karam: వాతావరణం మారినా, ఒంట్లో నలతగా ఉండి జ్వరం, జలుబు చుట్టుముట్టినా ముందుగా దెబ్బతినేది నాలిక రుచే. ఎలాంటి రుచికరమైన వంటకాలు తెచ్చిపెట్టినా గొంతులోకి ముద్ద దిగదు. సరిగ్గా ఇలాంటి సమయాల్లో మన నానమ్మలు, అమ్మమ్మలు వంటింట్లో దొరికే దినుసులతో అప్పటికప్పుడు ఒక ఔషధంలాంటి వంటకాన్ని రోట్లో నూరి పెట్టేవారు. అదే పల్లెటూరి నాటు రుచిని గుర్తుచేసే ‘ఎల్లిపాయ కారం’. ఘాటైన వెల్లుల్లి, కారం కలగలిసిన ఆ ఒక్క ముద్ద వేడి అన్నంలో పడితే చాలు.. మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, చప్పబడ్డ నాలుకకు జివ్వున ప్రాణం లేచొస్తుంది. ఎంతో సులువుగా చేసుకునే ఈ సంప్రదాయ రెసిపీని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
కారం పొడి: 3 టేబుల్ స్పూన్లు
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
రాళ్ళ ఉప్పు: రుచికి సరిపడా
పచ్చి జీలకర్ర: పావు టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 1 పెద్ద గడ్డ (పొట్టు వొలిచినవి)
నూనె లేదా నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
పోపు గింజలు: ఆవాలు (అర టీస్పూన్), మినప్పప్పు (పావు టీస్పూన్), పచ్చిశనగపప్పు (పావు టీస్పూన్), జీలకర్ర (పావు టీస్పూన్)
మెంతులు: కేవలం 4 నుంచి 5 గింజలు మాత్రమే
పోపు వెల్లుల్లి: 4 రెబ్బలు (పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచినవి)
ఎండు మిర్చి: 2 (ముక్కలుగా తుంచినవి)
కరివేపాకు: ఒక రెమ్మ
తయారీ విధానం
ముందుగా రోట్లో (రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో) 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, తగినంత రాళ్ళ ఉప్పు, పావు టీస్పూన్ పచ్చి జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. పొడి రెడీ అయ్యాక అందులో పొట్టు వొలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి రోకలితో దంచాలి. ఈ మిశ్రమంలో ఒక్క చుక్క నీరు కూడా కలపకూడదు. వెల్లుల్లిలోని సహజమైన రసమే కారంతో కలిసి చక్కటి ముద్దలా మారుతుంది. మరీ పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడా చిన్న వెల్లుల్లి పలుకులు తగిలేలా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత స్టవ్ మీద చిన్న పోపు గరిటె పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నువ్వుల నూనె వాడితే ఘుమఘుమతో పాటు శరీరానికి మంచి వేడినిచ్చి జలుబు త్వరగా తగ్గుతుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పుతో పాటు నాలుగైదు మెంతులు వేయాలి (మెంతులు ఎక్కువైతే చేదు వస్తుంది కాబట్టి లెక్కగా వేయాలి). అనంతరం పొట్టు తీయకుండా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించాలి. వెంటనే స్టవ్ కట్టేసి, ఆ వేడి నూనెలోనే తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే చక్కగా వేగిపోతాయి. ఈ తాళింపు నూనెను రోట్లో దంచిన వెల్లుల్లి ముద్దలో వేసి బాగా కలిపితే నానమ్మల నాటి ఎల్లిపాయ కారం రెడీ.
ఎందుకు అంత ప్రత్యేకం అంటే..
కారంలోనే నూనె పోపు సమృద్ధిగా కలవడం వల్ల ప్రత్యేకంగా అన్నంలో నెయ్యి వేసుకోవాల్సిన పనే ఉండదు. వేడి అన్నంలో డైరెక్ట్‌గా కలుపుకుని తింటే ఆ ఘాటుకు జలుబు, కఫం క్షణాల్లో మాయమవుతాయి. కేవలం అన్నంలోకే కాకుండా చద్ది అన్నం, వేడివేడి దోశ, ఇడ్లీలలోకి కూడా ఈ కారం సూపర్ కాంబినేషన్‌గా పని చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి గొంతు గరగర, తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. తడి తగలకుండా గాజు సీసాలో ఉంచితే వారం రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!