Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రయాణం పూలపాన్పు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారీ అంచనాల మధ్య ఆయన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. నాని సతీమణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 16 ఏళ్ల క్రితం నాని ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు 2009లో ఏం జరిగిందో వివరిస్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు. “నాకు ఇంకా గుర్తుంది.. 2009లో నీ సినిమా చూడటం కోసం మేమంతా కాలేజ్ బంక్ కొట్టి థియేటర్ కు వెళ్ళాం. కానీ తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది ఏంటంటే.. రిలీజ్ రోజున ఆ సినిమాకు కనీసం మార్నింగ్ షో కూడా పడలేదని! ఒక కొత్త హీరో సినిమా కరెక్ట్ టైం కి థియేటర్లలోకి తీసుకురావడం ఎంత కష్టమో అప్పుడు నాకు అర్థమైంది” అంటూ నాని కెరీర్ తొలినాళ్లలో పడ్డ స్ట్రగుల్స్ ను ఆమె కళ్లకు కట్టారు.
“కానీ 16 ఏళ్ల తర్వాత నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి. కేవలం నీ పేరు మీద ఉన్న నమ్మకంతోనే ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఒక్కో సినిమాతో నువ్వు సంపాదించుకున్న ఈ నమ్మకం చూస్తుంటే చాలా గర్వంగా, ఎమోషనల్ గా ఉంది. ఈ ‘రోమ్ నగరం’ ఒక్కరోజులో నిర్మించబడలేదు.. ఈ 16 ఏళ్ల నీ కష్టానికి, పోరాటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని” అంటూ భర్త సక్సెస్ పట్ల ఆమె గర్వం వ్యక్తం చేశారు. నాని ప్రతి సినిమాను తన సొంత బిడ్డలా ప్రేమిస్తారని ఆమె తెలిపారు. “నీ ప్రతి సినిమాను ఓ పసిబిడ్డలా చూసుకున్నావు. కొన్ని నడిచాయి, కొన్ని పరిగెత్తాయి, ఇంకొన్ని దారిలో దెబ్బలు తిన్నాయి.. కానీ అవేవీ నీకు ముఖ్యం కాదు, అదెప్పటికీ నీ బిడ్డే. ఈరోజు రాత్రి ‘ప్యారడైజ్’ కూడా తన బేబీ స్టెప్స్ వేయబోతోంది. ఏం జరిగినా అంతా మంచే జరుగుతుంది.. నీకు ఎప్పుడూ అండగా మేమున్నాం!” అంటూ నాని భార్య చేసిన ఈ హృదయపూర్వక పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భార్య ఇచ్చిన ఈ ఎమోషనల్ బూస్ట్ తో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!