Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు
- ‘దేవుడి ఆశీర్వాదం కోసం డీజేలు, బాణసంచా అవసరమా?’
- డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాణసంచా, డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పండుగలను శబ్ద, వాయు కాలుష్యానికి కారణం కాకుండా జరుపుకోవచ్చని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజా రహదారులపై బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన ఊరేగింపుల్లో లౌడ్స్పీకర్లు, డీజేలు, లేజర్ బీమ్స్ వినియోగం కూడా పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించింది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘దేవుడి ఆశీర్వాదం కోసం డీజేలు, బాణసంచా అవసరమా?’
లౌడ్స్పీకర్లు, బాణసంచా ఉపయోగించడం వల్ల దేవుడి నుంచి అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన సమాజంగా ఇలాంటి వాటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పండుగల సమయంలో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా వేడుకలు నిర్వహించవచ్చని పేర్కొంది. ఇందుకు పండర్‌పూర్‌కు జరిగే ‘వారీ’ యాత్రను ఉదాహరణగా కోర్టు ప్రస్తావించింది. ఎలాంటి లౌడ్స్పీకర్లు, పెద్ద శబ్దాలు లేకుండా ఆ యాత్ర ప్రశాంతంగా సాగుతుందని తెలిపింది.
Also Read
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
- Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
- Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
- Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
బాణసంచాకు అనుమతి లేదు
ఊరేగింపుల సమయంలో రోడ్లపై బాణసంచా కాల్చడం ప్రమాదకరమే కాకుండా విషపూరిత కాలుష్యానికి కారణమవుతుందని కోర్టు పేర్కొంది. ‘‘ముంబై వంటి నగరంలో ప్రజా రహదారులపై బాణసంచా కాల్చడానికి ఎందుకు అనుమతించాలి? ముంబైలో ఈ సమయంలోనే వాయు కాలుష్యం పెరిగి పొగమంచు వాతావరణం ఏర్పడుతుంది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. పగలైనా, రాత్రయినా ప్రజా రహదారులపై బాణసంచా కాల్చకూడదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఊరేగింపుల సమయంలో తీవ్ర శబ్ద, వాయు కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ మిలింద్ సాఠే వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు అనుమతి లేకుండా ఐదుగురికి మించి వ్యక్తులు గుమిగూడడాన్ని ముంబై పోలీసులు నిషేధించారని ఆయన తెలిపారు. బాణసంచా, లౌడ్స్పీకర్లపైనా పూర్తి నిషేధం అమల్లో ఉందని చెప్పారు. అయితే ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? అని కోర్టు ప్రశ్నించింది. నిబంధనలు కాగితాలపై మాత్రమే బాగున్నాయని, వాటి ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ప్రజా రహదారులపై బాణసంచా కాల్చడాన్ని ఇకపై నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఊరేగింపుల సమయంలో శబ్ద తీవ్రతను నియంత్రించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలీసుల నుంచి అనుమతి పొందిన అన్ని కార్యక్రమాలు, ఊరేగింపుల నిర్వాహకులు ఆ అనుమతిని స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ నిబంధన అన్ని పండుగలకు వర్తిస్తుందని పేర్కొంది.
ఊరేగింపులకు అనుమతి కోరే నిర్వాహకుల నుంచి ప్రభుత్వం భారీ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది. గణేశ్ మండపాలకు నిధుల కొరత లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసేలా నిబంధనలు రూపొందిస్తే అది నిరోధకంగా పనిచేస్తుందని కోర్టు పేర్కొంది. తాము ఎలాంటి పండుగ లేదా వేడుకలకు వ్యతిరేకం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వేడుకల పేరుతో నిబంధనలను ఉల్లంఘించడం, ఇతర పౌరులకు ఇబ్బంది కలిగించడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మతపరమైన భావాలను ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఎవరి ప్రాణాలకు లేదా ఆరోగ్యానికి ముప్పు కలిగేలా వేడుకలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
శబ్ద కాలుష్యం లేకుండా వేడుకలు నిర్వహించలేమా? అని కోర్టు ప్రశ్నించింది. ఒకేసారి అనేక ఊరేగింపులు జరిగితే శబ్ద కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందో ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించింది. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. ముంబై ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘‘వాళ్లు తమ వేడుకలు జరుపుకోవచ్చు. వేడుకలకు మేము వ్యతిరేకం కాదు. కానీ నిబంధనలు ఉండాలి, వాటిని కచ్చితంగా పాటించాలి. ప్రస్తుతం అసలు నియంత్రణే లేనట్టుగా ఉంది. ప్రజల్లో ఉన్న ఈ భావన మారాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టాలు ఉన్నప్పటికీ వాటిని కఠినంగా అమలు చేయడమే ప్రధాన సమస్యగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
-
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!