Prajwal rape victims: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారని సుర్జేవాలా వెల్లడించారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఇది భిన్నమైన కేసు అని.. గడిచిన 75 ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు అని సుర్జేవాలా తెలిపారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశారన్నారు. బీజేపీ కూటమిలో జేడీఎస్ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేసీని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Drug racket: మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ సీజ్
ప్రజ్వల్ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దర్యాప్తు సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపింది. ఇందుకోసం హెల్ప్‌లైన్ నెంబర్ 6360-938947 గా సిట్ పేర్కొంది. ఈ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!