మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిశోర్, గోవింద్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లో తొంగిచూసినట్లు గుర్తించారు.
మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం…