రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అని పాటలకు మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇక ఇప్పుడు నూతన సంవత్సరాది సందర్భంగా జనవరి 2వ తేదీన ప్రకటించినట్లుగానే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
READ MORE: Bengaluru: ఎయిర్‌పోర్టులో పగిలిన పైపు లైన్.. జలమయమైన కార్యాలయాలు
ఇక ఈ సినిమా ట్రైలర్ పరిశీలించినట్లయితే రెండు నిమిషాల 23 సెకండ్ల నిడివితో ఉంది. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలను పెంచేసేలా కట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒక పొలిటికల్ లీడర్ గా, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలలో రామ్ చరణ్ తేజ కనపడబోతున్నట్లుగా ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది.’కడుపు నిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలి పెడితే పెద్దగా దానికి నష్టమేమీ.లేదు? అది లక్ష చీమలకు ఆహారం అవుతుంది’, నా లాఠీ సేవ చేయడానికి మాత్రమే సంపాదించడానికి కాదు, నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్ నేను జీవితాంతం ఐఏఎస్ అని రామ్ చరణ్ చెబుతున్న డైలుగులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే ఒకే వ్యక్తి ఇలా భిన్నమైన గెటప్ లో కనిపించడా లేక భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారా అనే విషయాల మీద క్లారిటీ సినిమా చూస్తే కానీ రాదు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మీద ఈ ట్రైలర్ ఒకసారిగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి.
READ MORE: Switzerland: స్విట్జర్లాండ్‌లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!