తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా పరిగెడుతూ ముందుకు వెళ్లాయి. ఇక వైరల్ గా మారిన వీడియోను చూస్తే..
Also read: Mahesh Babu: వామ్మో.. ఆ రోజు మహేష్ వేసుకున్న షర్ట్ రేటు లక్షా?
ఈ వీడియోలో రెండు ఆర్మీ గుర్రాలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే వాటికీ గాయాలు అయినట్లు కూడా తెలుస్తోంది. ఆర్మీ నుండి తప్పిపోయిన గుర్రాలు ఇప్పటికి ఇంకా దొరకలేదు. వాటిని వెతకడంలో బ్రిటన్ అధికారులు నిమగ్నమయ్యారు. నిజానికి బ్రిటన్ ఆర్మీలో గుర్రాలు కూడా భాగమే. ఇందుకుగాను ఆ దేశంలో అనేక రకాల గుర్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం అనేక గుర్రపు శాలలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడక్కడ ప్రభుత్వ కార్యాలయల వద్ద కూడా గుర్రాలు కనిపిస్తాయి. ఈ సంఘటనలో భాగంగా మొదటిగా ఆర్మీ అధికారులు లండన్ పోలీసులకు ఫోన్ చేసి గుర్రాలు మిస్ అయ్యాయని తెలిపారు.
Also read: Maloth Kavitha: హామీలను ఏ ఏడాది ఆగస్టులో నెరవేరుస్తారు..?
ఇక గుర్రాలు తప్పిపోయినప్పటి నుంచి అటు ఆర్మీ అధికారులు, ఇటు నగర పోలీసులు ఇద్దరు వాటిని కనుగొనేందుకు కష్టపడుతున్నారు. రోడ్లపై గుర్రాలు పరిగెత్తుతున్న సమయంలో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు నగరంలోని రోడ్లపై ఏం జరుగుతుందో అన్నట్లుగా వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో సరిగ్గా సిగ్నల్ పడిన సమయంలోనే ఆ గుర్రాలు రోడ్డుపైన పరుగులు పెట్టడం కనపడుతోంది. అయితే ఈ గుర్రాల వల్ల ఇప్పటికి ఎలాంటి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు గుర్రాలతో పాటు మరో ఐదు గుర్రాలు కూడా ఆర్మీ అధికారులను చాలా ఇబ్బంది పెట్టాయని వారు తెలిపారు. ఆర్మీ డ్రిల్ లో భాగంగా ఆ రెండు గుర్రాలు వాటిపై కూర్చున్న సైనికులను కూడా కిందపడేసి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి గాయపడినట్లు అధికారులు తెలిపారు.
🚨 NEW: Runaway horses are currently on the loose in Central London
One horse is covered in blood after colliding with a bus
Police are working with the Army to locate them pic.twitter.com/yZ10SeiFV3
— Politics UK (@PolitlcsUK) April 24, 2024