Village and Ward Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు.. జూన్ 10వ తేదీ వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు.. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల్లో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.. ఇక, అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వనున్నారు..
Read Also: VC Sajjanar: ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్
కాగా, పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులై ఉండి వేర్వేరుచోట్ల పనిచేస్తున్న వారికి.. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది… కానీ, ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించారు.. ఇక, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు.. 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత.. సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేవలం నాలుగు నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల వీరికి వేతనాలు కూడా ప్రభుత్వం పెంచిన విషయం విదితమే.