VC Sajjanar: ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar Suggested IPL Management To Not Collaborate With Herbalife: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఒక సంచలన ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను హెర్బల్ లైఫ్ వంటి సంస్థలు నాశనం చేస్తున్నాయని.. అలాంటి సంస్థను స్పాన్సర్‌షిప్‌గా పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుగుకట్టు సంస్థలు అమాయకపు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి మోసపూరిత సంస్థలను పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవద్దని సూచించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ చేస్తూ.. ఐపీఎల్‌కు అఫీషియల్ స్పాన్సర్‌గా ఉన్నామని చెప్తూ.. ఇలాంటి సంస్థలకు మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఐపీఎల్‌ను అడ్డం పెట్టుకొని హెర్బల్ లైఫ్ తన వస్తువులను అమ్మి బురిడీ కొట్టిస్తుందని, హెర్బల్ లైఫ్ చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి సంస్థలపై విచారణ సంస్థలు కేసులు నమోదు చేసి, విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ఫోటోలు సైతం షేర్ చేశారు.
Allahabad HC: కారణం లేకుండా జీవిత భాగస్వామితో సెక్స్‌కు నిరాకరించడం మానసిక క్రూరత్వమే..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
‘‘హెర్బల్ లైఫ్‌లాంటి గొలుసుకట్టు సంస్థలు అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఐపీఎల్‌కు అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఉన్నామని చెప్పుకొని, ప్రొడక్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత సంస్థల్ని పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవడంపై ఐపీఎల్ యాజమాన్యం ఓసారి పునరాచించుకోవాలి. హెర్బల్ లైఫ్‌పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, మోసాలకు అడ్డుకట్ట వేయాలి’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. గతంలోనూ ఆయన ఇలాంటి వాటిపై ఎన్నో అభ్యర్థనలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు కూడా.. ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని సూచించారు. అలాగే.. జనాలకు కూడా ఇలాంటి సంస్థల ప్రకటనలు, బంఫర్ ఆఫర్లు చూసి మోసపోవద్దని తరచుగా సూచనలు ఇస్తూనే ఉన్నారు.
Raghunandan Rao: ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL, they promote their products extensively. IPL management should reconsider aligning with such… pic.twitter.com/28dME1M9rV
— Office of V.C. Sajjanar, IPS (@SajjanarOffice) May 25, 2023
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!