తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి…
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగులో యువ కథానాయకులకే కాదు అగ్ర కథానాయకులకు చక్కని మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు చక్రి. అతని సోదరుడు మహిత్ నారాయణ సైతం అన్నయ్య బాటలో నడుస్తూ, ఇప్పుడు పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ‘సి-స్టూడియోస్ (ది సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ పేరుతో ఓ స్టూడియోను నెలకొల్పబోతున్నారు. దీని లోగోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ…