తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి…