NTV Telugu Site icon

CM Revanth Reddy: మోడీ అంటే నాకు గొప్ప గౌరవం.. కానీ.. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

READ MORE: CSK vs RCB : ఆర్సీబీని ఎగతాళి చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫైర్

“కొందరు మార్కెటింగ్ చేసుకుంటారు. మాలాంటి వాళ్ళు కష్టపడుతుంటారు. నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఎందుకు ఉంటారు కోపంగా.. ఆడ బిడ్డలకు బస్సు ఫ్రీ ఇచ్చిన అందుకు కోపంగా ఉంటారా? 21 వేల కోట్లు రుణాలు మాఫీ చేసినందుకు కోపమా? ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా? సోషల్ మీడియాలో ఎవడో ఏదో పెడితే మీరు సైలెంట్ గా ఉండకండి. సోషల్ మీడియా అంటేనే పెట్టుబడి దారులది. పట్టు రాలేదు రేవంత్ కి అంటున్నారు. ఈటెల లాంటి వాళ్ళను పార్టీలో నుంచి బయటకు పంపినందుకు పట్టు వచ్చినట్టా. రాజయ్యని కారణం చెప్పకుండా తీసేస్తే పట్టు వచ్చినట్టా. సచివాలయానికే రాని ఆయనకు పరిపాలన మీద పట్టు ఉందట.18 గంటల పని చేసే నాకు పట్టు లేదట. తాజాగా కాంట్రాక్టర్ లు.. సచివాలయం వరకు వచ్చి ధర్నా చేశారు. అది మేము ఇచ్చిన స్వేచ్ఛ. మేము ధర్నా చేయానివ్వక పోతే పట్టు ఉన్నట్టా? పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే.. కేటీఆర్ ని దంచరా..? నువ్వు ఆదేశాలు ఇచ్చినవు.. మీరు ధర్నాలు చేసి తిడుతున్నారు. మేము అనుమతి ఇవ్వకపోతే చేస్తారా? మనుషుల రూపంలో ఉన్న క్రూర మృగాలు కనుక్కోలేనా నల్లమలలో పెరిగిన వాణ్ణి. సీఎం అనే వాడు.. విజ్ఞతతో ఉండాలి అందుకే విజ్ఞతతో ఉంటున్న. ఆయనకు విజ్ఞత లేదు కాబట్టి ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: AP Govt: మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు