సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే ప్రారంభమైందన్నారు. అలాగే, యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతా చారి బలిదానం చేశాడు అన్నారు.
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు.…
Bhatti Vikramarka : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే పర్వం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష రాయలేక పోయారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా పండగ లాగా నియామక పత్రాలు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క. సంవత్సరం లోపే 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు…
తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 15 లోపల చెల్లించవచ్చు. బ్యాంక్ మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదాగా భావించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ ఎక్సామ్ స్టార్ట్ కానుంది.