ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. మా టీమ్ బెస్ట్ అంటే.. మా టీమ్ బెస్ట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేసుకుంటారు. ఈ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆ టీమ్ ఫ్యాన్స్‌కే కాకుండా.. క్రికెట్ అభిమానులకు కూడా ఎంతో ఆసక్తి. కాగా.. ఐపీఎల్ 2025లో మార్చి 28న చెన్నైలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా..
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు బద్రీనాథ్ తన ఫన్నీ వీడియోతో ఇరకాటంలో పడ్డాడు. ఈ వీడియోలో వివిధ జట్ల ప్రతినిధులతో కరచాలనం చేయడం.. హగ్ చేసుకోవడం కనిపించింది. అయితే ఆర్సీబీ ప్రతినిధి వంతు వచ్చినప్పుడు బద్రీనాథ్ అతన్ని పూర్తిగా అవహేళన చేస్తూ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆర్సీబీపై సెటైరికల్ కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. బద్రీనాథ్ చేసిన ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: High Court: “సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలు భరణం అడగకూడదు..”
చెన్నై-బెంగళూరు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ హై-వోల్టేజ్ స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా అభిమానులకు అద్భుతమైన క్రికెట్ అనుభూతిని అందిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ధోనీ నేతృత్వంలో ఐదు టైటిళ్లు సాధించిన సీఎస్కే.. 2011లో ఫైనల్లో ఆర్సీబీని ఓడించి, వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. ఆర్సీబీ విషయానికి వస్తే ఎప్పుడూ స్టార్లతో నిండిన జట్టుగా కనిపించినా.. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. 2009, 2011, 2016లలో మాత్రమే ఆర్సీబి ఫైనల్‌కు చేరింది. 2016లో కోహ్లీ కెప్టెన్సీలో ఆఖరి అవకాశం వచ్చినా. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో RCB కొత్త కెప్టెన్ రాజత్ పాటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. కొత్త జట్టుతో ఆర్సీబీ బలంగా పోటీ ఇస్తుందా? లేదా మళ్లీ అదే కథ?ను రిపీట్ చేస్తుందో చూడాలి.