CM Revanth Reddy : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి
- ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం
- తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి
- సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధమ ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0 పూర్తయిందని.. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం@ 3.0 ప్రారంభమైందన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారని… ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ తలకటొరా స్టేడియంలో మంగళవారం నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో కుల సర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మహా యుద్ధాన్ని ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Akkineni : చైతు – శోభితల పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కు భారీ రేట్..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
జితని భాగి దారి.. ఉతని హిస్సే దారి.. (How much population you have community must get that much resources) కచ్చితంగా అమలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదం లో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారన్నారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారని.. వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచిందన్నారు. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దని, మనమంతా అందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు… రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే… మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాని మార్చాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు.
Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్‌వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!