యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరిని రాష్ట్రం వచ్చాక సస్యశ్యామలం చేసుకున్నామన్నారు. మళ్ళీ అధికారంలోకి రాగానే బస్వాపూర్ రిజర్వాయర్ ను నేనే ప్రారంభిస్తామని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ అరాచక శక్తులను పెంచి పోషించిందన్నారు. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉందని, రెవెన్యూలో అవినీతిని తగ్గించేందుకే ధరణి అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసుకువస్తుంది.. అదే జరిగితే ప్రజలకూ కష్టాలు తప్పవని, కౌలు రైతులకు హక్కులు యజమానికి ప్రమాదకరమన్నారు.
Also Read : Mee Kadupuninda: ‘మీ కడుపునిండా’ తినండి అంటున్న ఆర్కే రోజా!
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పైరవీ కారులు, దళారులు వస్తారు… భువనగిరిలో స్పెషల్ ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజారిటీతో గెలుస్తాము. మేనిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉంది.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలరా. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కాపీ కొట్టింది. రైతుబంధు, దళిత బంధు కాంగ్రెస్ కాపీ కొట్టింది. తెలంగాణ ఏర్పడకముందే రైతులు ఎన్నో తిప్పలు పడ్డారని, కరెంటు లేక రాత్రిళ్లు పొలాల దగ్గర కాపుగాసి నీళ్లు పారించుకునే వాళ్లని సీఎం చెప్పారు. 24 గంటల కరెంటు వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కానీ కొందరు రైతులకు మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.
Also Read : PM Kisan Yojana: కోట్లాది రైతులకు అలర్ట్.. వెంటనే ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే డబ్బులు పడకపోవచ్చు..