బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో ఏ చివరకు వెళ్లిన నేను దుఃఖంతో పోయేది, కళ్ళలో నీళ్ళు వచ్చేవన్నారు. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే ఎంపిగా పోటీచేయాలని జయశంకర్ సార్ చెప్పారన్నారు. మహబూబ్ నగర్ ఎంపిగా ఉంటూనే తెలంగాణ సాధించాను అనే కీర్తి చిరకాలం ఉంటుందని, నడిగడ్డలో ఒక ఊర్లో ఏడ్చానన్నారు. కృష్ణ నది పక్కనే పారుతున్న… గుక్కెడు నీళ్ళు లేవని, ముఖ్యమంత్రుల పర్యటనలు, నాటకాలు చూశామన్నారు సీఎం కేసీఆర్.
Also Read : Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం.. సోదరి కన్నుమూత..
అంతేకాకుండా..’మహబూబ్ నగర్ ఎప్పటికీ నా గుండెలో ఉంటది. జూరాల బెత్తెడు ప్రాజెక్ట్. అందులో ఉండేది 9 టీఎంసీలు. రోజుకు 2 టీఎంసీలు తీసుకుంటే మూడు రోజుల్లో ఖాళీ అవుతుంది. శ్రీశైలం వాళ్ల జాగీరా… అందుకే అక్కడి నుంచి తీసుకుందామని చెప్పాం. అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టరో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే. తెలంగాణ ఎవ్వడో ఊరికే వచ్చి ఇచ్చిపోలే. పిడికిలి ఎత్తి పోరాటం చేస్తే, అనేక మందిని బలితీసుకొని బాధలు పెట్టి, నేను అమరణ నిరాహార దీక్ష పట్టి చావు నోట్లో తల పెడితే వచ్చింది తెలంగాణ. ఇదే జిల్లాలో పుట్టిన కాంగ్రెస్ నేతలు కేసులు వేసి అడ్డం పడ్డారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని రిజర్వాయర్లలో నీళ్ళు చూస్తారు. లక్ష 50వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి… అదే జరిగితే కరువు కన్నెత్తి కూడా చూడదు. పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత నాది. పాలమూరు జిల్లా పాలుగారే జిల్లాగా, బంగారు తునకగా మారుతుంది. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. గణపతి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగ ఒకేసారి వస్తె ముస్లిం సోదరులు వాయిదా వేసుకున్నారు.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Minister Vidadala Rajini: ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి.. కేంద్రమంత్రికి విడదల రజినీ వినతి